Header Banner

రైతులకు భారీ శుభవార్త! 100 శాతం సబ్సిడీతో పరికరాలు! కానీ వారు మాత్రమే అర్హులు!

  Wed Feb 19, 2025 07:00        Politics

రైతుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్ కిందసబ్సిడీలు అందజేయనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు డ్రిప్‌, స్పింక్లర్ల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్‌ ఇరిగేషన్ పరికరాలను ఎస్సీ, ఎస్టీ సమాజికవర్గాల్లోని రైతులకు 5 ఎకరాల వరకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. 

 

ఇక.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్య తరగతి రైతులు, ఐటీడీఏ పరిధిలో 5-10 ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఖరారు చేశారు. అదే.. కోస్తాంధ్ర జిల్లాల్లో 5-10 ఎకరాల మధ్యస్థ రైతులకు 70 శాతం, పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీకి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించనున్నారు. స్పింక్లర్లపై అన్ని కేటగిరీల రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ సబ్సిడీలో 27 నుంచి 33 శాతం కేంద్ర ప్రభుత్వం, 17 నుంచి 67 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సబ్సిడీలు ఇలా.. 5 ఎకరాలలోపు ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్న కారు రైతులకు 100 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు. ఎస్సీ, ఎస్టీయేతర చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.2.18 లక్షల వరకు). రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు రైతులు, గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.3.14 లక్షల వరకు) అందించనున్నారు. కోస్తా జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం సబ్సిడీ (రూ.3.10 లక్షలు వరకు), అదే 10 ఎకరాలకు పైబడిన రైతులకు 50 శాతం సబ్సిడీ(రూ.4లక్షలు) అందించనున్నారు. 

 

డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 5 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం (రూ.19 వేలు), 12.5 ఎకరాల్లోపు ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 50 శాతం (రూ.19వేలు) చొప్పున సబ్సిడీ అందించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 75,035 మంది రైతులు సబ్సిడీ ప్రయోజనం పొందారు. 2023–24లో సూక్ష్మ సేద్యంలో దేశంలోని టాప్‌ 20 జిల్లాల్లో ఏపీ నుంచి ఐదు జిల్లాలు ఉన్నాయి. అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP